ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర :ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జైనులు , జార్ఘండ్ లోని పరమ పవిత్రమైన “శిఖర్ జీ” ఆలయ పవిత్రతను కాపాడుకొనే నిమిత్తం జార్ఖండ్ ప్రభుత్వ చర్య పట్ల నిరసన తెలుపుతూ తెనాలిలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. తెనాలి పట్టణంలోని జైనులందరూ మహిళలలు, చిన్న పిల్లలతో సహా గురు జైన్ టెంపుల్ నుండి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సేవ్ శిఖర్ఙీ అంటూ నినదిస్తూ ర్యాలీగా వెళ్ళి సబ్ కలెక్టరు గీతాంజలి శర్మకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ 24 తీర్థంకరులలో 20మంది తీర్దంకరులు మోక్షం పొందిన జైనాలయాన్న, జార్ఘండ్ ప్రభుత్వ చర్యను దుయ్యబట్టారు.
తాము ఉపవాసముండి చెప్పులు లేకుండా నడచి పవిత్రంగా చూసుకునే జైనాలయం టూరిస్టు రిసార్ట్ చెయటం తమని ఎంతో వేదిస్తుందని, తక్షణమే జార్ఘండ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెనాలిలోని జైనులందరూ చిన్న పిల్లలతో కలిసి కుటుంబాలతో సహా ర్యాలీలో పాల్గొనటం ప్రజలు ఆసక్తిగా గమనించారు.