Saturday, November 23, 2024

ఎయిర్‌ ఇండియా వీఆర్‌కు భారీగా దరఖాస్తులు..

ఎయిర్‌ ఇండియా ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు భారీ స్పందన వచ్చింది. వీఆర్‌ఎస్‌ కోసం 4500 మంది ఉద్యగులు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు , కొత్తగా యువతను ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో టాటా గ్రూప్‌ వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాలో 12085 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 8,084 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 4001 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు.

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో మరో 1434 మంది పని చేస్తున్నారు. సంస్థలో 55 సంవత్సరాలు పూర్తయిన వారు, లేదా 20 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసిన వారి కోసం ఈ వీఆర్‌ఎస్‌ను ప్రకటించింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో సుమారు 5 వేల మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇలాంటి వారే ఎక్కువ మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement