Friday, November 22, 2024

మార్కెట్లకు భారీ నష్టాలు.. ఇన్వెస్టర్ల సంపద 10.65 లక్షల కోట్ల అవిరి

స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నాడు భారీగా పతనమయ్యాయి. కీలక సూచీలు రెండు శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు 10.65 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. వచ్చే వారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం జరగనుంది. అదానీ కంపెనీ పై వచ్చిన ఆరోపణలతో ఆ గ్రూప్‌ కంపెనీల షేర్లను భారీగా నష్టపోయాయి. ఇలా అనేక కీలక అంశాల ప్రభావంతో సూచీలు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, మన సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఒక దశలో 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది.

సెన్సెక్స్‌ 874.16 పాయింట్ల నష్టంతో 59330.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 287.60 పాయింట్ల నష్టంతో 17604.35 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 110 రూపాయలు తగ్గి 56852 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 362 రూపాయలు తగ్గి 68314 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.57 రూపాయిలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు..

టాటా మోటార్స్‌, ఐటీసీ, ఎం అండ్‌ ఎం, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, దివిస్‌ ల్యాబ్‌, సిప్లా షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటార్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement