ఇప్పటి వరకు ఐదుగురు జనరల్స్‌తో సహా 7,000 మంది రష్యన్ సైనికులు మరణించారు. ఇరాక్ లేదా అఫ్గాన్ యుద్ధాలలో వరుసగా 4,825, 3,576 మంది మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య కంటే ఇది ఎక్కువ. రెండవ ప్రపంచ యుద్ధం యొక్క పసిఫిక్ థియేటర్‌లో అత్యంత తీవ్రమైన దశలో జపాన్ దళాలతో ఐదు వారాల పాటు జరిగిన పోరాటంలో 6,852 మంది సైనికులు మరణించారు. 19,000 మంది గాయపడ్డారు.
రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కూడా భారీ నష్టాలను చవిచూసింది. కీవ్ చెబుతున్న 1300 కంటే ఎక్కువ మందే సైనికులు మరణించి ఉండొచ్చు. ఉక్రెయిన్ సైన్యం ప్రకటన ప్రకారం, రష్యాకు చెందిన 466 ట్యాంకులు, 115 హెలికాప్టర్లు, 914 వాహనాలు, 95 విమానాలు, 213 ఫిరంగి వ్యవస్థలు, 44 విమాన నిరోధక ఆయుధాలు, 60 ఇంధన ట్యాంకులను ధ్వంసమయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..