Friday, November 22, 2024

ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులకు భారీ నష్టం: కేంద్ర మంత్రి వీకే సింగ్‌

న్యూఢిల్లి: కొవిడ్‌ విలయతాండవం సృష్టించిన 2020-21లో దేశీయ విమానయాన సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయి. ఎయిర్‌లైన్స్‌ రూ.19,564 కోట్లు, ఎయిర్‌పోర్టులు రూ.5,116 కోట్ల చొప్పున నష్టాలను చవిచూశాయని పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ సోమవారం వెల్లడించారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల ఇంతటి నష్టాలు వాటిల్లాయని ఆయన పేర్కొన్నారు. కరోనా బయటపడడం, భారత్‌లో మార్చి 25, 2020 నుంచి మే 24, 2020 మధ్యకాలంలో షెడ్యూల్డ్‌ దేశీయ విమానాలు రద్దవ్వడం ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టుల నష్టాలకు దారితీశాయని ఆయన చెప్పారు. కొవిడ్‌-19 పరిణామాల కారణంగా భారత్‌లో విమానయాన రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement