Monday, September 16, 2024

TG | జూరాలకు భారీగా పెరిగిన ఇన్‌ఫ్లో..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ప్ర‌భ‌న్యూస్ బ్యూరో : జోగులాంబ్ గ‌ద్వాల జిల్లాలోని ప్రియ‌ద‌ర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ప్రాజెక్టులోకి 3,85,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆల్మ‌ట్టి, నారాయ‌ణ‌పూర్ నుంచి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది.

దీంతో అధికారులు ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి 3,87,555 క్యూసెక్కులు స్పిల్‌వే ద్వారా కింద‌కు విడిచిపెడుతున్నారు. ఎడ‌మ ప్ర‌ధాన కాలువ ద్వారా 430 క్యూసెక్కులు, కుడి ప్ర‌ధాన కాలువ ద్వారా 290 క్యూసెక్కులు విడుద‌ల చేస్తున్నారు.

జూరాల పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 318.516 మీట‌ర్లు కాగా, ఇప్పుడు 317.9 మీట‌ర్ల‌ నీరు ఉంది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటి నిల్వకుగాను ప్రస్తుతం 8.300 టీఎంసీలు (85.94%) ఉంది. మొత్తం అవుట్‌ఫ్లో 3,88,320 క్యూసెక్కులు విడుద‌ల చేస్తున్నామ‌ని, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కుల నీరు పోతోంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement