రాజధాని ఢిల్లిలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగడంతో ఇక్కడా ప్రభావం చూపాయి. శుక్రవారం పది గ్రాముల బంగారం (24 కేరట్లు) విలువ రూ.594 పెరిగి 50,341కు చేరింది. గురువారం పది గ్రాముల బంగారం ధర 49,747 కాగా శుక్రవారం భారీగా పెరిగింది. మరోవైపు వెండి ధరలుకూడా అదే తీరులో పెరిగాయి. గురువారం కిలో వెండి ధర 54,166 కాగా శుక్రవారం ఏకంగా 988 రూపాయలు పెరిగి రూ. 55,164కు చేరిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,718 డాలర్ల అత్యధిక ధర పలకడం, వెండి ఔన్స్ ధర 18.81 డాలర్లకు చేరడంతో ఇతర మార్కెట్లపైనా ప్రభావం పడిందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.
- Advertisement -