Friday, November 22, 2024

భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు.. సండే రోజు రికార్డ్‌ నమోదు

దేశీయ విమాన ప్రయాణీకులు ఆ ఆదివారం నాడు రికార్డ్‌ స్థాయిలో నమోదయ్యాయి. 2020 మే స్థాయికి ప్రయాణీకుల సంఖ్య చేరుకుంది. కోవిడ్‌కు ముందున్న ట్రాఫిక్‌లో 96 శాతానికి ఈ సంఖ్య చేరింది. ఆదివారం నాడు దేశీయంగా మొత్తం కలిపి 4,09,831 మంది దేశంలోకి వివిధ గమ్యస్థానాలకు విమానాల్లో ప్రయాణించారు. వరసగా శని, ఆదివారాల్లో ప్రయాణీకుల సంఖ్య 4 లక్షలకు పైగా నమోదు అయ్యింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఇలా వారాంతంలో వరసగా రెండు రోజులు నాలుగు లక్షల మంది ప్రయాణీకులు నమోదు కావడం ఇదే మొదటిసారి. శనివారం నాడు 4.05,963 మంది దేశీయ ప్ర్‌యాణీకులు నమోదయ్యారు.

ఈ ఆదివారం (27వ తేదీ) నాడు అన్ని విమానయాన సంస్థలు కలిపి 2,739 విమాన సర్వీస్‌లను నడిపించాయి. 96.7 శాతం అక్వూపెన్సీతో గో ఫస్ట్‌ విమానయాన సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. స్పైస్‌ జెట్‌ విమానాల్లో అక్వూపెన్సీ 95 శాతంగా ఉంది. క్రిస్మస్‌ సమీపిస్తుండంతో సెలవులు కాలంలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండిగో విమానాల్లో ఆదివారం నాడు 2,50,000 మంది ప్రయాణించారు. క్రమంగా కోవిడ్‌కు ముందు నాటి ట్రాఫిక్‌కు త్వరలోనే పూర్తి స్థాయిలో చేరుకుంటామని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ అభిప్రాయపడ్డారు. సెలవులు కాలం పూర్తి అయ్యే వరకు రోజుకు కనీసం నాలుగు లక్షల మంది ప్రయాణీకులు నమోదు అయ్యే అవకాశం ఉందని పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement