Tuesday, November 19, 2024

ఆగస్టు లో శ్రీవారి హుండీ భారీ ఆదాయం.. మొదటిసారి 140 కోట్లు దాటిన హుండీ ఆదాయం

తిరుమల, ప్రభన్యూస్‌ : ఏడుకొండలవాడి దర్శనం కోసం ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఎన్నో వ్యయప్రయాసకోర్చి తిరుమల చేరుకున్న భక్తులు శ్రీవారి క్షణకాల దర్శనం కోసం క్యూలు కడుతుంటారు గతంలో ప్రతినిత్యం స్వామివారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే సంఖ్య 10 నుంచి 25 వేలు ఉండగా, క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం సాధారణ రోజుల్లో 70 నుంచి 80 వేలు, సెలవు పర్వదినాల్లో లక్షకు పైగా ఉంటుంది. స్వామివారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈఏడాది 22 లక్షల 80 వేల 84 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య సాధారణంగా ఉన్నప్పటికీ ఆగస్టు నెలలో స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. టీటీడీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆగస్టు నెల ఐడు సార్లు భక్తులు హుండీ ద్వారా 5 కోట్లకు పైగా కానుకలు సమర్పించడంతో మొద్దమొదటి సారి శ్రీవారి హుండీ ఆదాయం 140 కోట్లు 07 లక్షల రూపాయలు హుండీ ద్వారా ఆదాయం లభించింది. ఇప్పటి వరకు ఒక్కనెలలో శ్రీవారికి అత్యంధికంగా లభించిన హుండీ ఆదాయం ఇదే కావడం విశేషం. ఇక 10 లక్షల 79 వేల 900 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement