Tuesday, November 19, 2024

Follow up | శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం.. 15కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు

ఉమ్మడి రంగారెడ్డి, ప్రభన్యూస్‌ బ్యూరో: శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నారు. 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 7.90కోట్లు ఉంటుందని అంచనా. గురువారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సుడాన్‌ నుంచి 23 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిపై అనుమానం రావడంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేయగా వీరినుండి పెద్దఎత్తున బంగారం లభ్యమైంది. కొందరు షూ వెనకాల, కొందరు టైలో బంగారం దాచుకుని వచ్చారు. వీరందరినీ విడివిడిగా తనిఖీ చేయగా ఈ విలువైన బంగారం బయటపడింది.

వీరినుండి ఏకంగా 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ. 7.90కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఆ నలుగురిని కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి అక్రమంగా బంగారం తరలింపు విషయమై కస్టమ్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నారు. వారంలో రెండుమూడు రోజులు అక్రమ బంగారం పట్టుకోవడం పరిపాటిగా మారింది. గురువారం పట్టుబడిన బంగారం ఇటీవల దొరికిన బంగారంతో పోలిస్తే చాలా ఎక్కువ.

Advertisement

తాజా వార్తలు

Advertisement