Sunday, January 19, 2025

Maha Kumbh Mela లో భారీ అగ్నిప్రమాదం..

ఉత్తరప్రదేశ్‌లోని పరయోగరాజ్‌లో జ‌రుగుతున్న‌ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 30 టెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ప్రమాదం జరగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పారు. ఇక ఈ ఘ‌ట‌న‌లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. సమీపంలోని టెంట్లలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement