కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 40 మంది భారతీయులతో సహా 43 మంది సజీవదహనమయ్యారు. ఇప్పటికే ఈ భవనంలో వందలాది మందికి చిక్కుకుపోయారు.. వారిలో 54 మందిని రక్షించి చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదం కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో జరిగింది. 43 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున మంటలు అంటుకుని భవనం అంతా వేగంగా వ్యాపించాయి. దీంతో చాలా మంది లోపలే చిక్కుకున్నారు. ఈ భవనంలో ఎక్కువగా కార్మికులు నివాసముంటున్నారు.
భారత్ దిగ్ర్బాంతి ….
అగ్రిప్రమాదం పట్లు భారత విదేశాంగం మంత్రి జై శంకర్ దిగ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రమాద వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ప్రమాదస్థలానికి వెళ్లవలసిందిగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులను జై శంకర్ ఆదేశించారు..