Tuesday, November 26, 2024

భ‌గీర‌థ ప్యాలెస్ మార్కెట్ లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌ల‌పే ఆర్పేందుకు రిమోట్ కంట్రోల్ ఫైర్ ఇంజిన్స్

ఓ మార్కెట్ లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ప‌లు దుకాణాలు కాలి బూడిద‌య్యాయి.32పైరింజిన్ల‌తో మంట‌ల‌ను అదుపుచేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు సిబ్బంది. ఈ సంఘ‌ట‌న ఢిల్లీ చాందినీచౌక్‌లోని భగీరథ ప్యాలెస్ మార్కెట్‌లో చోటుచేసుకుంది. రిమోట్ కంట్రోలుతో పనిచేసే అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని ఢిల్లీ అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో చాందినీచౌక్‌లోని ప్రధాన భవనం దెబ్బతిన్నట్టు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఘటనా స్థలాన్ని డాక్టర్ హర్షవర్థన్ సందర్శించారు. మంటలను అదుపు చేస్తున్నామని, ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని హర్షవర్థన్ వెల్లడించారు.

మంటలను ఆర్పడానికి 40 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చామని, ఢిల్లీ ఫైర్ సర్వీసుల శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో భగీరథ ప్యాలెస్ మార్కెటులోని పలు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. తొలుత ఓ దుకాణంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న భవనం ఇరుకైన ప్రదేశంలో ఉండటం వల్ల అగ్నిమాపక యంత్రాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో మంటలను అదుపుచేయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని, రెండు అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. మిగతా భవనాలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement