Friday, January 24, 2025

Maharashtra : భారీ పేలుడు… ఐదురురు మృతి

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఇవాళ పెను ప్రమాదం సంభవించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఈ పేలుడులో ఐదుగురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ లోపల గందరగోళం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ లోపల ఉన్న ఇతర ఉద్యోగులను సురక్షితంగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement