Sunday, November 24, 2024

China : యాంజియావోలో భారీ పేలుడు..రెస్క్యూ టీమ్‌ సహాయకచర్యలు…

చైనాలోని యాంజియావోలో భారీ పేలుడు సంభవించింది. డ్రాగన్ కంట్రీ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం చైనా రాజధాని బీజింగ్‌ నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ఈఘ‌ట‌న చోటుచేసుకుంది. యాంజియావోలోని ఒక పాత భవనంలోని కింది అంతస్తులో నడుపుతున్న రెస్టారెంట్‌ లో గ్యాస్‌ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న చుట్టు పక్కల భవనాలతో పాటు వాహనాలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి.

- Advertisement -

ఇక, పేలుడు సంభవించిన భవనాల శిధిలాలు చుట్టు పక్కల ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ భారీ ఎత్తున్న నీలి మంటలు ఎగిసిపడినట్లు వైరల్ అవుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పోతే, ఈ భారీ పేలుడులో ఇంత వరకు ఎంత మంది చనిపోయారోన్న వివరాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.. పేలుడు ధాటికి గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు అధికారులు. పేలుడు సంభవించిన కొద్దిసేపటికే ఆ ప్రాంతానికి రెస్క్యూ టీమ్‌ వచ్చి సహాయక చర్యలు మొదలు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement