Thursday, January 23, 2025

Bijapur : భారీ ఎన్ కౌంటర్.. ఒడిస్సా కార్యదర్శి చలపతితో సహా 16మంది హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతిచెందారు. మ‌ర‌ణించిన వారిలో ఒడిస్సా రాష్ట్ర కార్యదర్శి చలపతితో సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. చిత్తూరు జిల్లా బంగారు పాలెంకు చెందిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి తలపై కోటీ రూపాయిల రివార్డు కూడా ఉంది.. అనేక విధ్వంసకర కార్యక్రమాలకు అతడిదే మాస్టర్ మైండ్ .. 2011లో మల్కన్ గిరి కలెక్టర్ వినిత్ ను కిడ్నాప్ చేసింది కూడా చలపతే..

కాగా, సోమవారం సాయంత్రం నుంచి గరియాబంద్‌, నౌపాడ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్‌ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సందర్బంగా పోలీసులు భారీగా ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు..

అదేవిధంగా నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతిచెందగా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్‌ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్‌ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement