Wednesday, November 20, 2024

Earthquake : న్యూ గినియాలో భారీ భూకంపం… 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు…

పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర పాపువా న్యూ గినియాలోని అంబుంటిలో 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

- Advertisement -

భూకంప కేంద్ర అంబుంటికి తూర్పు-ఈశాన్యంగా 38 కిలో మీటర్ల దూరంలో 40.2 కి.మీ లోతులో ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడంతో పాపువా న్యూ గినియాలో భూకంపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement