పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూగనియాలో భారీ భూకంపం సభవించింది. ఆదివారం తెల్లవారుజామున కైనాంన్టూలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రాజధాని పోర్ట్ మోర్స్‌బేకి 480 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూఅంతర్భాగంలో 68 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నంది. భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement