జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది. దీని ధాటికి పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి. ఒక్కసారిగా ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
భారీ భూకంపం సంభవించడంతో జపాన్‌లోని వివిధ ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మియాజాకి, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్, కొచ్చి, ఓయిటా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మియాజాకి ప్రిఫెక్చర్‌లో 20 సెంటీమీటర్ల ఎత్తు మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. 7.1 తీవ్రత భూకంపం పరిణామాలను అధికారులు అంచనా వేస్తున్నారు.