Friday, November 22, 2024

అమెజాన్‌కు భారీ గిరాకీ.. ఒకే రోజులో అత్యధిక లాభాలు..

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం.. అమెజాన్‌ భారీ లాభాలను నమోదు చేసుకుంది. అమెరికా చరిత్రలోనే ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక మార్కెట్‌ విలువను సంపాదించుకున్న సంస్థగా అమెజాన్‌ రికార్డు నెలకొల్పింది. త్రైమాసిక ఫలితాలు మదుపర్లను ఎంతో మెప్పించడంతో కంపెనీ షేర్లు భారీ పెరిగాయి. సుమారు 13.50 శాతం మేర అమెజాన్‌ షేర్లు లాభపడ్డాయి. దీంతో అమెజాన్‌ మార్కెట్‌ విలువ ఒకే రోజులో 190 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.14.18 లక్షల కోట్లు) ఎగబాకి.. 1.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఒకరోజు వ్యవధిలో అత్యధిక విలువను కోల్పోయి రికార్డు సృష్టించడం విశేషం. అమెజాన్‌ తాజాగా టెస్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. జనవరి 28న వెలువడిన త్రైమాసిక ఫలితాలు.. అంచనాలను మించడంతో టెస్లా షేర్లు ఆ రోజు భారీగా ర్యాలీ అయ్యాయి.

పెరగనున్న ప్రైమ్‌ సభ్యత్వ ధరలు..

ఒక్క రోజులో 181 బిలియన్‌ డాలర్ల అదనపు మార్కెట్‌ విలువను కంపెనీ సొంతం చేసుకుంది. తాజాగా ఈ రికార్డును అమెజాన్‌ 190 బిలియన్‌ డాలర్లతో అధిగమించింది. త్రైమాసిక ఫలితాలు మెప్పించడం.. అమెరికాలో ప్రైమ్‌ సభ్యత్వం ధరలను పెంచుతున్నట్టు ప్రకటించడమే అమెజాన్‌ షేర్ల ర్యాలీకి కారణంగా తెలుస్తున్నది. ఈ ర్యాలీని రిటైల్‌ మదుపర్ల లాభాల స్వీకరణకు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. కొనుగోలు ఆర్డర్ల కంటే.. అమ్మకం ఆర్డర్లే.. శనివారం ఎక్కువగా కనిపించినట్టు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. అమెజాన్‌ ఒక్క రోజులో పోగేసుకున్న సంపద ఏటీఅండ్‌ టీ, మోర్గాన్‌ స్టాన్లీ, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ప్రముఖ కంపెనీల మార్కెట్‌ విలువతో సమానం కావడం గమనార్హం. ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ యజమాని ఆల్ఫాబెట్‌.. వాల్‌స్ట్రీట్‌ అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి. వరుసగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.8 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2,09,00,000 కోట్లు), 2.3 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,71,67,800 కోట్లు), 1.9 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,41,82,100 కోట్లు)గా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement