Wednesday, November 20, 2024

AP | వరి విస్తీర్ణంలో భారీ లోటు.. 1.53 లక్షల హెక్టార్లలో తగ్గుముఖం

అమరావతి, ఆంధ్రప్రభ : సాగునీరు లేక రాష్ట్రంలో ఖరీప్‌ విస్తీర్ణం భారీగా తగ్గుముఖం పట్టే సూచలను కనబడుతున్నాయి. ఖరీఫ్‌ లో అత్యధికంగా సాగు చేసే వరి సాగు విస్తీర్ణవం 1.53 లక్షల హెక్టార్లు తగ్గిపోయినట్టు కేంద్ర వ్యవసాయశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈనెల 18 నాటికి దేశవ్యాప్తంగా వివిధ పంటల సాగు విస్తీర్ణంపై క్షేత్రస్థాయిల నుంచి వచ్చిన గణాంకాలను మదింపు చేసి నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్ల్రో పంటల సాగు ఈ ఏడాది ఖరీప్‌ సీజన్‌ లో భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతున్నట్టు కేంద్ర వ్యవసాయశాక అభిప్రాయపడింది.

ఏపీలో ఏకంగా 1.53 లక్షల హెక్టార్ల వరి విస్తీర్ణం తగ్గుముఖం పట్టటం ఆందోళనకు గురి చేస్తోంది. సాగునీటి వసతుల, ప్రకృతి అనుకూలతలతో ఏటా పెరుగుతూ వస్తున్న వరి సాగు ఒక్కసారిగా తగ్గిపోవటం ద్వారా అయిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్టు అధికారులు భావిస్తున్నారు. వరితో పాటు నూనెగింజలు 2.66 లక్షల హెక్టార్లు, చెరకు 0.10, పత్తి 2.10, పప్పు దినుసులు 0.45, చిరు ధాన్యాలు 0.17, కంది 0.52, మినుములు 0.08, పెసలు 0.07 లక్షల హెక్టార్లలో తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది.

ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్ల్రో వరి సాగు విస్తీర్ణం తగ్గినట్టు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. గత ఏడాది 2022 ఖరీఫ్‌ సీజన్‌ లో ఇదే సమయానికి దేశ వ్యాప్తంగా 36.55 లక్షల హెక్టార్లలో వరి సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది కేవలం 26.55 లక్షల హెక్టార్లలోనే సాగు దశలో ఉంది. అన్ని పంటల కన్నా వరి సాగు విస్తీర్ణంలోనే 27.35 శాతం అత్యధిక లోటు ఏర్పడింది. కృష్ణా బేసిన్‌ లో నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద అత్యధికంగా సాగయ్యే వరి నీళ్లు లేక బోసిపోతోంది. దుక్కి దున్ని నారుపోసి నీళ్ళ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఆశలు అడియాసలవతున్నాయి. వర్షాల్లేకపోవటం,ఎగువ నుంచి ఇన్‌ ప్లో లేకపోవటం వల్ల శ్రీశైలం, సాగర్‌ జలాలను కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని కృష్ణా బోర్డు కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణంపై నెలకొన్ని అనిచ్చితి మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement