కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు తగ్గినా.. ఫ్యాన్సీ నెంబర్ల డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా తెలంగాణలో ఓ ఫ్యాన్సీ నంబర్ భారీ రేటు పలికింది. TS 09 FR 9999 నెంబర్‌ను ఓ వాహనదారుడు రూ.7.6 లక్షలతో సొంతం చేసుకున్నాడు. దీంతో 9999 నంబర్ మరోసారి రికార్డు ధరకు అమ్ముడైంది. సాధారణంగా ఈ సంఖ్యకు చాలా పోటీ ఉంటుంది. లాక్‌డౌన్ తొలిసారి ఓ ఫ్యాన్సీ నంబర్‌ను వేలంలో పోటీ పడి మరీ కొనుగోలు చేశారు.
మరోవైపు ‘TS 09 FS 0009’ అనే మరో నెంబర్ రూ.6.5లక్షలకు అమ్ముడైంది. తాజాగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్లపై ఒక్క రోజే సుమారు రూ.30 లక్షల మేర ఆదాయం లభించింది. కాగా సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై ఉండే విశ్వాసం, కొన్ని నంబర్ల వల్ల అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: టిక్ టాక్ ప్రియులకు గుడ్ న్యూస్