ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో విస్తృతంగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్సు పోలీసులు బృందాలుగా వీడిపోయి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈ దాడుల్లో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. కోటి విలువైన 127 ఎర్రచందనం దుంగలను, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన మురుగన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలిందని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement