అంతరిక్షంలోకి వెళ్లిన హబుల్ టెలిస్కోప్ మూడు దశాబ్దాల నుంచి మానవాళికి సేవలు అందిస్తోంది. శూన్య గురుత్వాకర్షణ ప్రదేశం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 100 కోట్ల సెకన్ల పాటు విస్తృత సేవలు అందించింది. విశ్వంలోని అంతుచిక్కని రహస్యాలను ఛేదించే ప్రక్రియలో ఈ అంతరిక్ష నౌక స్మారక చిహ్నంగా ఉంది. దీనికితోడుగా ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. హబుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలకు కీలకమైన ఆస్తిగా మిగిలిపోతుంది. 1990 ఏప్రిల్ 25న ప్రారంభించబడిన హబుల్ మూడు దశాబ్దాలకు పైగా అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణలు, అంతరిక్ష ఐకానిక్ చిత్రాలను అందించింది. దాని కార్యకలాపాల సమయంలో, టెలిస్కోప్ భాగాలను భర్తీ చేయడానికి, మరమ్మత్తు చేయడానికి ప్లయింగ్ అబ్జర్వేటరీ అనేక సార్లు సేవలను అందించింది. 1.5 మిలియన్ కంటే ఎక్కువ శాస్త్రీయ పరిశీలనలు చేసింది. హబుల్ ఆవిష్కరణల ఆధారంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, భవిష్యత్ నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ రూపొందించబడ్డాయి. ఇవిరెండు విశ్వంపై మన అవగాహనను విస్తరించేందుకు హబుల్‌తో కలిసి పనిచేస్తాయని నాసా తెలిపింది.
సోలార్ సిస్టమ్‌ను వెలికితీస్తోంది..
సౌర వ్యవస్థ అంతర్గత, బయటి గ్రహాలను పరిశీలించడం, వాటి వాతావరణాలను పరిశీలించడం, చంద్ర వ్యవస్థలను పరిశీలించడంలో హబుల్ కీలకం. బృహస్పతి గురించి హబుల్ పరిశీలనలు వాతావరణం, చంద్రుడు, గ్యాస్ జెయింట్ చుట్టూ ఉన్న విశ్వ వస్తువులను అధ్యయనం చేసే అనేక మిషన్లకు సహాయపడింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొన్ని నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించనుంది. అక్టోబర్ 2021లో ప్రారంభించిన లూసీ మిషన్‌కు మద్దతుగా ట్రోజన్ గ్రహశకలాల కూర్పు భాగాలను అధ్యయనం చేయడంలో హబుల్ సహాయం కొనసాగిస్తుంది. చిన్న, మసకబారిన వాటిని కూడా హబుల్ గుర్తించగలదని నాసా తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital