Thursday, November 7, 2024

Bail | జానీ మాస్టర్‌కు బెయిల్‌

హైద‌రాబాద్ – లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్‌ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్‌ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. కోర్టు ఆయకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గడువు ముగియడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. కాగా, రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పోక్సో కోర్టులో దాఖలు చేసిన పిటిషనన్‌ను ఈ నెల 14న కోర్టు తిరస్కరించింది. తాజాగా ఆయనకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. దీంతో ఆయన నేటి సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement