Sunday, November 24, 2024

AP | ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే..

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమైనందున రాజధాని 29 గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలు ‘సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌ డే’ ప్రతి శుక్రవారం తుళ్లూరు ఏపీ సీఆర్డీఏ ప్రాంతీయ కార్యాలయంలో జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సం(ఏపీ సీఆర్డీఏ) కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అదనపు కమిషనర్‌ జి.సూర్య సాయిప్రవీణ్‌ చంద్‌ అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ గ్రీవెన్స్‌ డేలో అమరావతి రైతులు పాల్గొని వారి సమస్యలు పరిష్కరించుకోవచ్చని కమిషనర్‌ సూచించారు..

గ్రీవెన్స్‌ డేకు విశేష స్పందన..

సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తుళ్లూరు సీఆర్డీఏ ప్రాంతీయ కార్యాలయంలో గ్రీవెన్స్‌ డే జరిగింది. వివిధ విభాగాల అధికారుల సమక్షంలో జరిగిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు రాజధాని గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించుకున్నారు. రైతుల సమస్యలపై స్పందించిన అదనపు కమిషనర్‌ వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement