రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో హ్సీహ్ సు-వీ, వాంగ్ జిన్యు జోడీ టైటిల్ విజేతగా నిలిచింది. టేలర్ టౌన్సెండ్, లేలా ఫెర్నాండెజ్ ద్వయంపై వీరు 1-6, 7-6 (5), 6-1తో గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకున్నారు. స్టాసబర్గ్ టోర్నీ తర్వాత ఇది హ్సీహ్, వాంగ్‌కి రెండవ టోర్నీ. ఈ సీజన్లో వీరికిదే మొదటి డబుల్స్ టైటిల్.
చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఐదు సీడ్ జట్లను ఓడించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో 10వ సీడ్ జోడీ టౌన్సెండ్, ఫెర్నాండెజ్‌తోపాటు అంతకు ముందు అన్‌సీడెడ్ ద్వయం నెం 5 సీడ్ షుర్స్, క్రావ్సిజ్క్, ఆరవ సీడ్ మెలిచార్, పెరెజ్, 9వ సీడ్ జాంగ్, వ్లూడెనోవిక్, 15వ సీడ్ కుడెర్మెటోవా, సామ్సోనోవా జోడీలను ఓడించారు. 2021లో గాయం కారణంగా గ్రాండ్‌స్లామ్ ఆడని హ్సీకి ఇది అద్భుతమైన పునరాగమనం.
37 ఏళ్ల హ్సీ ఇప్పటి వరకు ఐదు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. ఇందులో మూడు వింబుల్డన్ (2013, 2019, 2021), రెండు గారోస్ (2014, 2023) ఉన్నాయి. రోలాండ్ గారోస్ ఆమెకు 31వ డబుల్స్ టైటిల్. ఇక వాంగ్‌కు రోలాండ్ గారోస్‌లో ఇది మూడవ డబుల్స్ టైటిల్.