కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత నదిలో శనివారం ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. బెజ్జూరు మండలం ఎర్రబండరేవు వద్ద ప్రాణహిత నదిలో ఐదుగురు స్నేహితులు ఈతకు వెళ్లారు. అయితే నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
గల్లంతైన వారిని బెజ్జూరుకు చెందిన జహర్ హుస్సేన్ (24), ఇర్షాద్ (20), మొయిసిద్ (22)గా గుర్తించారు. వీరు గల్లంతైనట్లు స్నేహితులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.