Friday, November 22, 2024

శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట్‌ల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు..

  • ఈ మూడు ప్రాంతాల అద్దె అలవెన్స్‌ 24 శాతంలోకి..
  • ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్సులో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. హైదరాబాద్‌ నగరానికి సమీపంగా ఉన్న శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట్‌ ప్రాంత ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధికి 8 కిలోమీటర్ల పరిధిలోని ఉద్యోగులకు 24శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని ఆర్ధిక శాఖ శనివారం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తొలి తెలంగాణ వేతన సవరణ కమిషన్‌ ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వుల్లో తగు సవరణలను చేసింది. తొలి వేతన సవరణ పెంపు జీవోలో ఈ మూడు ప్రాంతాలకు 13శాతం ఇంటిఅద్దె అలవెన్సును పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం 8 కిలోమీటర్ల పరిధిలోని ఈ ప్రాంతాలను కూడా జీహెచ్‌ఎంసీలో వర్తింపజేస్తున్నట్లుగా 24శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారంనాడు ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు జీవో 72ను జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement