Tuesday, November 26, 2024

హెచ్‌పీ పెవిలియన్‌ ల్యాప్‌టాప్‌.. 12వ జెన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌

న్యూఢిల్లి : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కన్జ్యూమర్‌ డివైజ్‌ల కోసం మెరుగైన పనితీరు కోసం 12వ జెన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ ద్వారా పవర్‌ చేయబడే పెవిలియన్‌ ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ కంపెనీ లాంచ్‌ చేసింది. సరికొత్త పెవిలియన్‌ సిరీస్‌ – హెచ్‌పీ పెవిలియన్‌ 15, హెచ్‌పీ పెవిలియన్‌ 14, హెచ్‌పీ పెవిలియన్‌ 360లు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిచబడ్డాయి. బౌండ్‌ ప్లాస్టిక్స్‌, రీసైకిల్‌ చేయబడిన అల్యూమినియంను కలిగి ఉన్న ఆల్‌ మెటల్‌ ల్యాప్‌టాప్‌తో నిర్మించబడ్డాయి. హెచ్‌పీ పెవిలియన్‌ 15లో ఐ సేఫ్‌ సర్టిఫైడ్‌ డిస్‌ప్లే ఉంది. కంటికి ఇబ్బంది కల్గించకుండా.. వీలుగా వైద్యుల సహకారంతో తయారు చేయబడింది. 2019లో 35 గంటలు ల్యాప్‌టాప్‌లతో ఉన్న వారితో పోలిస్తే.. 2021 నాటికి 60 గంటలకు పెరిగింది. పర్సనల్‌ సిస్టమ్స్‌ – హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ విక్రం బేడీ మాట్లాడుతూ.. పీసీలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి.

నేటి ప్రపంచంలో వినియోగదారులు పనితీరు, పోర్టబిలిటీ, స్థిరత్వంతో కలిపిన పరికరాల కోసం చూస్తున్నారు. హెచ్‌వీ ఉత్తమ కంప్యూటింగ్‌ అనుభవాలను అందిస్తున్నది. హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ దేశ వ్యాప్తంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పీసీలు ప్రతీ ఒక్కరి జీవితంలో అనివార్యం అయ్యాయి. 1.75 కిలోగ్రాములు బరువు ఉన్న హెచ్‌పీ పెవిలియన్‌ 15 కాంపాక్ట్‌.. ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వార్‌ ్మ గోల్డ్‌, నేచురల్‌ సిల్వర్‌, ఫ్లాగ్‌ బ్లూతో సహా మూడు రంగుల్లో లభ్యం అవుతున్నాయి. హెచ్‌పీ పెవిలియన్‌ ల్యాప్‌టాప్‌ల ధరలు రూ.55,999 నుంచి రూ.65,999 వరకు ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement