Tuesday, November 26, 2024

మహిళలు థైరాయిడ్ సమస్యను ఎలా గుర్తించాలి?

ప్రస్తుతం మహిళలను బాగా వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్‌ ఒకటి. సాధారణంగా థైరాయిడ్‌ అంటే ఒక హార్మోన్‌. ఇది ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. షుగర్, బీపీల తర్వాత థైరాయిడ్‌ ఆ తర్వాతి స్థానంలో ఉంది. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళల తప్పని సరిగా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి అయితే 30 ఏళ్ల వయస్సు రాకముందే, థైరాయిడ్‌ బారిన పడుతున్నారు. పెళ్లి కాకముందు నుంచి కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో మహిళలకు సంతాన యోగం కలగటం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగటం ప్రధాన సమస్య.

థైరాయిడ్‌ను ప్రారంభ దశలోనే గుర్తించాలని వైద్యులు చెప్తున్నారు. కొన్ని లక్షణాలతో థైరాయిడ్‌ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గకపోవడం. ఎంత నిద్రపోయినా అలసటగా ఉండడం. నెలసరి క్రమం తప్పడం. గర్భం దాల్చలేకపోవడం. భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు, డిప్రెషన్‌ లక్షణాలు. మెడ వాపుగా ఉండటం, గొంతు బొంగురుపోవడం. చర్మం పొడిబారడం, గోళ్లు విరగడం, జుట్టు రాలడం. మలబద్ధకం, ఏకాగ్రతాలోపం, జ్ఞాపకశక్తి తగ్గడం ఇవి కూడా థైరాయిడ్‌లో భాగమే. అందుకే ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే వెంటనే సమస్యను పరిష్కరించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఐపీఎల్ కొత్త యాడ్.. ధోనీ రాకింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement