Sunday, November 3, 2024

తెలంగాణలో ఉచిత విద్యుత్ పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి

లాండ్రీ షాపులు, దోబీ ఘాట్లు, సెలూన్ల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల రజక, 70వేల నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి నేటి నుంచి (జూన్ 1) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లబ్ధిదారులు www.tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌లో వ్యక్తిగత వివరాలు, షాపు వివరాలు, అప్‌లోడ్ వంటి మూడు ప్రధాన విభాగాలు ఉంటాయి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పేరు, జెండర్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ , కులధ్రువీకరణ పత్రాలు, ఉపకులం, యూనిట్ పేరు, యూనిట్ చిరునామాతో పాటు తన పేరు లేదా అద్దె నివాసానికి చెందిన కమర్షియల్ ఎలక్ట్రికల్ వినియోగదారుల కరెంట్ మీటర్ వంటి వివరాలతో పాటు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్‌లకు చెందిన కార్మిక లేదా వాణిజ్య లైసెన్సులను అప్‌లోడ్ చేసి స్వీయ ధ్రువీకరణతో ఆన్‌లైన్ అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement