IPL-2023 చివరి దశకు చేరుకుంది. ఇవ్వాల అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. అయితే నిన్ననే (ఆదివారం) జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఇవ్వాల్టికి పోస్ట్ పొన్ అయింది. కాగా, ఈ ఐపీఎల్ సీజన్ లో గెలిచిన వారికి దక్కే ప్రైజ్ మనీ వివరాలను తెలుసుకుందాం.
విజేతకు ఎన్ని కోట్లు?
స్పోర్ట్‌స్టార్ నివేదిక ప్రకారం.. ఈ సీజన్ ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లు ఇస్తారు. అదేవిధంగా రన్నరప్‌కు ప్రైజ్ మనీ రూ.13 కోట్లు ఇస్తారు.
ఎలిమినేటర్ ముంబై ఇండియన్స్ విజేతకు 7 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు 6.5 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది.
ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాడికి ప్రైజ్ మనీ ఎంత?
ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి రూ.15 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. ఈ జాబితాలో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 851 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌లో సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న బ్యాట్స్‌మన్‌కు ప్రైజ్ మనీ రూ.15 లక్షలు ఇస్తారు.
పర్పుల్ క్యాప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత లభిస్తుంది?
ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన ఆటగాడికి రూ.15 లక్షలు ప్రైజ్ మనీగా అందజేస్తారు. ప్రస్తుతం ఈ జాబితాలోనూ గుజరాత్ టీమ్ ఆటగాడు మహ్మద్ షమీ 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ (27), మోహిత్ శర్మ 24 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.