టెస్లా అధినేత ఎలన్ మస్క్.. తాను కట్టే పన్నుపై వస్తున్న విమర్శలకు టిట్టర్ వేదికగా సమాధానం చెప్పాడు. ఎప్పుడూ తాను పన్ను ఎగ్గొట్టలేదని, తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవాల్సి వస్తోందన్నారు. ఈ ఏడాది తాను దాదాపు రూ.85 వేల కోట్ల (11 బిలియన్ డాలర్లు) పన్ను కట్టేందుకు సిద్ధమైనట్టు తెలిపాడు. ఈ ఏడాది టెస్లా మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్లు దాటింది. ఫోర్డ్ మోటార్స్, జనరల్ మోటార్స్ రెండింటి విలువ కంటే ఎక్కువ. ఇప్పటి వరకు 14 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను మస్క్ విక్రయించాడు. అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ కూడా ఎలన్ మస్క్‌కు కితాబు ఇచ్చింది.
అయితే దీన్ని తట్టుకోలేని అమెరికాకు చెందిన డెమొక్రాటిక్ సెనేటర్ ఎలిజబెత్ వార్రెన్.. మస్క్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. పన్ను ఎగవేత పద్ధతి మారుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి మస్క్ కూడా ధీటుగా బదులిచ్చాడు. తాను పన్ను ఎగ్గొట్టే వ్యక్తి కాదన్నాడు. రెండు సెకన్లు కళ్లు తెరిచి చూడాలని హితవు పలికాడు. ఈ ఏడాది తాను చెల్లించే పన్ను.. అమెరికా చరిత్రలోనే అత్యధికం అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఎంత చెల్లించబోతున్న విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital