Friday, November 22, 2024

ఈజీగా చ‌నిపోవ‌డం ఎట్లా? ఇంట‌ర్నెట్‌లో వెతికిన ప్ర‌త్యూష‌, ఇంట్రెస్టింగ్ విష‌యాలు వెలుగులోకి!

హైద‌రాబాద్‌లో మొన్న సూసైడ్‌ చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) కేసులో ప‌లు ఇంట్రెస్టింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ప్రత్యూష 10 రోజుల ముందు నుంచే దానికి మానసికంగా ప్రిపేర్ అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే, నొప్పి తెలియకుండా, ఎట్లాంటి బాధా క‌ల‌గ‌కుండా ఈజీగా చ‌నిపోవ‌డం ఎలా అనే దానిపై ఇంటర్నెట్‌లో వెతికి ప‌లు వివరాలు సేక‌రించినట్టు తెలుస్తోంది. కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం ద్వారా అయితే ఎట్లాంటి బాధ లేకుండా సింపుల్‌గా తెలుసుకుని అది కొనుగోలు చేశారు. అయితే.. దానిని ఎక్కడి నుంచి కొనుగోలు చేసింద‌నే విష‌య‌మ్మీద‌ పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం కుదరదని భావించిన ప్రత్యూష దానికి తన బొటిక్‌ను సరైన ప్లేస్‌గా ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌.. ఆత్మహత్యకు వారం రోజుల ముందు బాత్రూంలోని కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని కంప్లీట్‌గా మూసి వేయించిన్టు పోలీసులు గుర్తించారు. మొన్న‌టి శుక్రవారం ఉదయం రెండుసార్లు బయటకు వెళ్లిన ఆమె సాయంత్రం నాలుగున్న గంటల సమయంలో తిరిగి వచ్చారు. ఆ టైమ్‌లో ఆమె వద్ద పనిచేసే దుర్గ.. తాను కిరాణా షాపుకు వెళ్తున్నానని ప్రత్యూషకు చెప్పిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. దీంతో త‌న ప‌నిమ‌నిషిని వెళ్లమని చెప్పిన ఆమె తాను పిలిచేదాకా లోపలికి రావొద్దని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆ తర్వాతి రోజు ఉదయం గది నుంచి ప్రత్యూష బయటకు రాకపోవడంతో దుర్గ దంపతులు తులుపు తట్టినా తీయలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యూష తండ్రి, డ్రైవర్ వచ్చినట్టు దుర్గ, ఆమె భర్త వీరబాబు పోలీసులకు తెలిపారు.

కాగా, ప్రత్యూష గది నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌ను ఆమే రాసినట్టు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న ఆమె బయటపడే మార్గం లేకపోవడం వల్లే ఇంత‌టి క‌ఠిన‌ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. స్నేహితులు, సన్నిహితుల వద్ద ప్రత్యూష తన నిరాశను వ్యక్తం చేసినా.. ఆమె తీవ్ర మానసిక ఘర్షణకు గురవుతున్న విషయాన్ని వారు గుర్తించలేకపోయారని పోలీసులు భావిస్తున్నారు. చివరికి తాను కోరుకున్న జీవితం ఇది కాదని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె లేఖ ద్వారా తెలుస్తోంది. కానీ, దేనికైనా మ‌ర‌ణం అనేది చివ‌రి జ‌వాబు కాద‌ని, బ‌త‌క‌డానికి పోరాటం చేయాలే కానీ, ఇట్లా చ‌నిపోకూడ‌ద‌ని అంటున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement