Wednesday, September 18, 2024

TG | అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఇళ్ల స్థలాలు..

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇంటి కేటాయింపు పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అయితే, ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల ఎదురు చూసిన జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీలో 73 మంది నిజాన్ని చూడక ముందే కన్నుమూశారని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని… జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement