కుత్బుల్తాపూర్ (ప్రభ న్యూస్): నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న వానలతో కుత్బల్లాపూర్ అతలాకుతలమవుతోంది. నియోజకవర్గంలోని 132 జీడిమెట్ల డివిజన్ పరిధి, శ్రీనివాసనగర్ని వరద ముంచెత్తింది. కాలనీలోని చాలా ఇండ్లు నీటమునిగాయి. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్సింహారెడ్డి కాలనీలో పర్యటించారు. పరిస్థితులను స్వయంగా చూశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అదేవిధఫగా ఎం.ఎన్.రెడ్డి నగర్ లో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుందని కాలనీవాసులు తెలిపారు. దీంతో ఆ కాలనీలో పర్యటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. కుత్బుల్లాపూర్ లో శిధిలావస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏ అవసరం ఉన్నా తమను సంప్రదించాలని చెప్పారు.