కృష్ణా జిల్లాలో కరోనా సోకిన రోగులకు అనుమతి లేకుండా వైద్య సేవలు అందించే ఆసుపత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కలెక్టరు కార్యాలయంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి పై జిల్లా వైద్యాధికారి డా. యం. సుహాసిని, డిసి హెచ్యస్ డా.జ్యోతిర్మణి, వైద్యాధికారి డా. చైతన్యకృష్ణలతో కోవిడ్ రోగులకు వైద్యం అందించడం పై కలెక్టరు సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు 14 ఆసుపత్రులకు అనుమతులిచ్చామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. అందులో సుమారు 1086 పడకలు కోవిడ్ రోగులకోసమే కేటాయించామన్నారు.
ఈ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే రోగులకు ఆరోగ క్రింద వైద్య సేవలు అందిస్తారన్నారు. అందువల్ల జిల్లాలో ప్రజలు ఈ ఆసుపత్రులకే వెళ్లాలని కలెక్టరు విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండా కోవిడ్ రోగులకు వైద్యం చేయవద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా వైద్యం అందిస్తే అల్లోపతి హాస్పటల్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఎ పిడిమిక్ యాక్టు ప్రకారం చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో అనుమతి పొందిన ఆసుపత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, విజయవాడ : 250 పడకలు
2.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మచిలీపట్నం : 150 పడకలు
3. టైమ్ హాస్పటల్స్, విజయవాడ : 35 పడకలు
4. ఇండో బ్రిటీష్ హాస్పటల్, విజయవాడ : 25 పడకలు
5. క్యాపిటల్ హాస్పటల్స్, విజయవాడ : 25 పడకలు
6. ఆంధ్రాహాస్పటల్స్, మచిలీపట్నం : 16 పడకలు
1. యంబియస్ యాక్సిడెంట్ హాస్పటల్, విజయవాడ : 20 పడకలు
8. నాగార్జున హాస్పటల్, విజయవాడ : 15 పడకలు
9. కామినేని హాస్పటల్స్, విజయవాడ : 25 పడకలు
10. నిమ్రా హాస్పటల్, ఇబ్రహీంపట్నం : 300 పడకలు
11. శ్రీ అను హాస్పటల్, విజయవాడ : 25 పడకలు
12. రైల్వే హాస్పటల్, విజయవాడ : 60 పడకలు
13. పియవ్యంయస్ హాస్పటల్, చిన అవుటపల్లి : 100 పడకలు
14. ఆయుఃష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ హాస్పటల్, విజయవాడ : 40 పడకలు
పై తెలిపిన ఈ గుర్తింపు పొందిన ఆసుపత్రులు మినహా ఇతర ఆసుపత్రుల్లో కరోనారోగికి వైద్యం అందించే అవకాశం లేదని కలెక్టరు స్పష్టం చేశారు.