Wednesday, November 20, 2024

ఆస్పత్రులా ? భారీ పరిశ్రమలా ?

ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నచిన్న నివాస భవనాల్లో ఆస్పత్రుల నిర్వహణకు అనుమతులు ఇవ్వడంకంటే, ప్రభుత్వాలే మెరుగైన ఆస్పత్రులను నిర్మించి ఇవ్వాలని సూచించింది. మానవుల బాధల మధ్య ఆస్పత్రులు భారీ పరిశ్రమలుగా మారాయని, ఈ విధమైన వైద్యసేవల కంటే వాటిని మూసేయడమే మంచిదని సుప్రీం
కోర్టు అభిప్రాయపడింది. భవన నిర్మాణ అనుమతులకు
సంబంధించి ఆస్పత్రులకు గడువును పొడిగించినందుకు
గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది.

ఒక కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి మర్నాడు డిశ్చార్జి కావాల్సి ఉండగా, ఇంతలో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు నర్సులు కూడా సజీవదహనం అయ్యారు. ఇవి మన కళ్లముందుజరిగిన మానవ విషాదాలు. ఇలాంటి ఆస్పత్రుల కోసం ఎక్కు వ సమయం ఎందు కివ్వాలి? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఆస్పత్రులు రియల్ ఎస్టేట్ పరిశ్రమ గా మారాయి. బాధలో ఉన్న రోగులకు సహాయాన్ని అందించడానికి బదులు, అవి మనీ ముద్రణ యంత్రాలుగా మారాయని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ ఆస్పత్రులు అవసరం. 4-5 పడకలతో కూడిన పది అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వకుంటే, దాదాపు 30 వేల పడకలు అందు బాటులో లేకుండా పోతాయి అని చెప్పారు. ఈ వాదనను తోసిపుచ్చిన న్యాయ మూర్తి, ఈ నర్సింగ్ హోమ్ లోపాలను క్షమించడంలో అర్ధం లేదన్నారు.

ఏదేమైనా మొదట అవి ఆ భవనాల్లో కొనసాగడానికి వీల్లేదు. మీరు ఏదైనా సిఫార్సు చేయాలనుకుంటే దిద్దుబాటు చర్య అనివార్యం. రాష్ట్రం కొవిడ్ కేర్ సెంటర్లను కొనసాగించ నివ్వండి. కానీ చిన్న చిన్న నివాస భవనాలలో ఆస్పత్రు లనుఅంగీకరించేది లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జూన్ 2022 వరకు ఆస్పత్రులు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ నోటిఫికేషన్ పై ధర్మాసనం స్పందించింది. న్యాయస్థానం ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు
అధిగమించలేవు. మీరు కార్లే బ్లాంచ్ ఇచ్చి ఆస్పత్రులు
అంటున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా 2022 వరకు
కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అదే జరిగితే అప్పటి
దాకా ప్రజలు మరణిస్తూనే ఉంటారు.. దహనం చేయబడు
తూనే ఉంటారు. అయినా ఆస్పత్రుల్లో ఫైర్ సేఫీ సమస్యపై
కమిషన్ నివేదికను సీల్ కవర్ లో ఎందుకిచ్చారు. ఇదేమైనా
అణు రహస్యమా? అంటూ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు.
వెంటనే ఆస్పత్రులకు సడలింపు ఇచ్చే నోటిఫికేషన్‌ను వెనక్కి
తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement