Friday, November 22, 2024

బాలుడి ప్రాణం తీసిన రూ.100..నీలోఫ‌ర్ వార్డ్ బాయ్ నిర్వాహ‌కం..

ప్ర‌భుత్వ ఆసుప్ర‌తుల వ‌ద్ద వార్డ్ బాయ్ ద‌గ్గ‌ర నుంచి వ‌సూల్ మొద‌ల‌వుతాయ‌నే విష‌యం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. డ‌బ్బు చేతిలో ప‌డితేనే గాని ఆసుప‌త్రిలోకి ఎంట్రీ ఉండ‌ద‌న్న విష‌యం నిరూపిత‌మ‌యింది. కాగా తాజాగా పిల్ల‌ల హాస్ప‌ట‌ల్ నీలోఫ‌ర్ లో వార్డ్ బాయ్ వల్ల ఓ బాలుడు ప్రాణాన్ని కోల్పొవ‌ల‌సి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వంద రూపాయల కోసం అభం శుభం తెలియని… ఓ బాలుడి ప్రాణం తీశాడు నీలోఫర్‌ ఆస్పత్రి వార్డ్ బాయ్.

ఎర్రగడ్డ కు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంత కాలంగా నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. మూడు రోజుల క్రితం మహ్మద్ ఖాజాను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు.బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందించారు వైద్యులు.

అయితే…బాలుడు చికిత్స పొందుతున్న వార్డులోనే మరొక.. వ్యక్తికి ఆక్సిజన్‌ కావాల్సి వచ్చింది. దీంతో వార్డు బాయ్ కి 100 రూపాయలు ఇచ్చాడు మరొక పేషెంట్. దీంతో బాలుడి ఆక్సిజన్ తీసివేసి రూ.100 ఇచ్చిన పేషెంట్ కు ఆమార్చాడు వార్డు బాయ్. దీంతో ఆక్సిజన్ అందక బాలుడు మృతి చెందాడు. ఈ బాలుడు ఘటనపై ఆసుప‌త్రి సూప‌రింటెండ్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. బాలుడు మృతి కి కారణమైన వార్డ్ బాయ్ ని సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న మ‌రోసారి పున‌రావృతం కాకూడ‌ద‌ని స్టాఫ్ ని హెచ్చ‌రించారాయ‌న‌. ఇటువంటి సంఘ‌ట‌న‌ల వ‌ల్లే ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌పై చిన్న‌చూపు క‌లుగుతుంద‌ని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement