Tuesday, October 8, 2024

Results : హర్యానాలో హోరాహోరీ…క్షణ క్షణం మారుతున్న లీడింగ్స్…

హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ముందుగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది. ఇక్కడ ఆరంభంలో వెనకబడ్డ బీజేపీ ఆ తర్వాత పుంజుకుంటోంది. అయితే ఫలితాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.

క్షణక్షణం లీడింగ్ మారుతోంది. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా… అధికారానికి 46 సీట్లు అవసరం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. ఆరంభం నుంచి వెనుకంజలో ఉన్న బీజేపీ అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ 43 సీట్లలో, కాంగ్రెస్ 40 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ అన్ని స్థానాల్లో వెనుకబడి ఉంది. మరోవైపు, జమ్మూకశ్మీర్ విషయానికి వస్తే… కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement