Thursday, December 12, 2024

TG | తెలంగాణ తల్లి రూపశిల్పికి గౌరవం.. జేఎన్‌ఎఫ్‌ఏయు ఇన్‌చార్జ్‌ వీసీగా గంగాధర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన తెలంగాణ ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి గంగాధర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ విగ్రహ రూపాన్ని గంగాధర్‌ అధ్యక్షతన ఖరారు చేయగా ఆయన్ను జేఎన్‌ఎఫ్‌ఏయు వర్సిటీ ఉపకులపతిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంపిక చేశారు.

హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌లో ఉన్న జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (జేఎన్‌ఎఫ్‌ఏయు) విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న తోపరపు గంగగాధర్‌ను ఈ విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జ్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement