చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు హానర్… తమ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత నెలలో అమెరికాలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో ఇది తన కొత్త లైనప్‌ను ప్రకటించింది. కాగా, ఇటీవల ఈ లైనప్‌లో “హానర్ మ్యాజిక్ 6” సిరీస్‌ను లాంచ్ చేసింది. లైనప్‌లో రాబోయే మరో స్మార్ట్‌ఫోన్ “హానర్ 100” సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది.
కాగా, ‘‘హానర్ 100’’, ‘‘హానర్ 100 ప్రో’’ స్మార్ట్ఫోన్లు నవంబర్ 23న చైనాలో విడుదల కానున్నాయి. హానర్ ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోను కూడా షేర్ చేసింది. అయితే, కంపెనీ తన హోమ్ టర్ఫ్‌లో ఫోన్ల లభ్యత వివరాలను వెల్లడించలేదు. హానర్ స్మార్ట్‌ఫోన్ లైనప్ గ్లోబల్ లభ్యత గురించి ఎటువంటి వివరాలను కూడా పంచుకోలేదు.
హానర్ 100 సిరీస్ స్పెషిఫికేషన్లు (అంచనా) :
హానర్ 100, హానర్ 100 ప్రో స్మార్ట్ఫోన్లు రెండూ పెద్ద కెమెరా మాడ్యూల్స్ వంటి క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేలను కలిగి ఉన్నాయని కంపెనీ చెబుతోంది. అయితే, రాబోయే స్మార్ట్ఫోన్లలో మునుపటి మోడల్‌లలోని సింగిల్ కెమెరాతో పోలిస్తే.. రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి. నోట్బుక్చెక్ నివేదిక ప్రకారం.. హానర్ 100 ప్రో గత వెర్షన్ల మాదిరిగానే అల్ట్రా-వైడ్-యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, హానర్ 100 ప్రో అదనంగా బ్యాక్ సైడ్ కెమెరాను కలిగి ఉంటుంది.
వనిల్లా మోడల్లో అందుబాటులో ఉండదు. హానర్ ఇంకా ఫుల్ కెమెరా స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు. వైబోలో షేర్ చేసిన టీజర్ ఫొటోల వివరాలను నిర్ధారించాయి. ఉదాహరణకు, రెండు మోడల్‌లు ఎఫ్/1.9 ఎపర్చరుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటాయి. ఫీచర్లను పోల్చి చూస్తే.. హానర్ 90 సిరీస్ స్మార్ట్ఫోన్లు 200ఎంపీ సెన్సార్‌తో వచ్చాయి. రాబోయే స్మార్ట్ఫోన్లు కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ద్వారా పనిచేస్తాయి. 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.