భారత్లో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి తమ దేశానికి విమాన రాకపోకలను కొన్నాళ్లపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇండియాతో పాటు పాకిస్థాన్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా విమాన రాకపోకల్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు అంటే 14 రోజుల పాటు ఈ మూడు దేశాల నుంచి విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నందున.. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాంకాంగ్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే భారత్ నుంచి విమాన రాకపోకలపై న్యూజిలాండ్ కూడా నిషేధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement