Friday, November 22, 2024

Sports | హాంకాంగ్​ ఓపెన్​ బ్యాడ్మింటన్.. ​టోర్నీలో ముగిసిన భారత్‌ పోరాటం

హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ సూపర్‌-500 టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. నిన్న జ‌రిగిన‌ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ రిటైర్ హార్ట్‌ అవ్వ‌గా, ప్రియాంషు రజావత్ మొదటి రౌండ్‌లో 13-21, 14-21 తేడాతో జపాన్‌కు చెందిన కాంటా సునేయామా చేతిలో ఓడిపోయాడు. ఇక‌.. ఇవ్వాల (గురువారం) జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మహిళల డబుల్స్ జోడీ కూడా ఓడిపోవడంతో హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భారత్ పోరాటం ముగిసినట్టు అయ్యింది.

ఇండోనేషియాకు చెందిన జంటతో త‌ల‌ప‌డిన భార‌త జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్‌ కేవలం 36 నిమిషాల్లో 8-21, 14-21 రెండు సెట్ల‌లో ఓడిపోయి హాంకాంగ్ ఓపెన్ లో త‌మ‌ పోరాటాన్ని ముగించారు. ఆ తర్వాత తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జపాన్‌కు చెందిన టాప్ సీడ్‌లతో పోరాడ‌గా.. ఈ జోడీ కేవలం 38 నిమిషాల్లో 18-21, 7-21 తేడాతో ఓటమి చెందారు. కాగా, భారతీయ స్టార్​ ప్లేయర్స్​ పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ హాంకాంగ్ మీట్‌లో పాల్గొనక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement