భారత్ బైక్ మార్కెట్‌లో హీరో తర్వాత హోండా కంపెనీ మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది. హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు హోండా షైన్ 125 సీసీ బైక్‌లకు మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు అదే మోడల్ పేరుతో 100 సీసీ ఇంజన్‌తో హోండా సంస్థ కొత్త బైక్‌ను విడుదల చేసింది. హోండా సంస్థకు భారత్‌లో 125 సీసీ ఆపైన మోడళ్లు ఉన్నాయి.
యూనికాన్, హోండా షైన్ బైక్స్ అమ్మకాలు భారీగా ఉన్నాయి. అయితే, 100 సీసీ బైక్‌ల విషయంలో మాత్రం హోండా, హీరో కన్నా వెనుకబడి ఉంది. 100 సీసీ రేంజ్ బైక్‌ల అమ్మకాల్లో హీరో సంస్థకు తిరుగులేదు. దానికి కారణం హీరో స్ల్సెండర్ బైక్‌లు. ఇప్పుడు హోండా, 100 సీసీ బైక్‌ల మార్కెట్‌లో హీరోకు పోటీ ఇచ్చేందుకు వచ్చేసింది.
హోండా షైన్ 100 సీసీ బైక్ ధర రూ. 64,900 (ఎక్స్ షోరూం). హోండా షైన్ 100 సీసీ బైక్ ఆరేళ్ల వారంటీ ప్యాకేజీతో వస్తుందని, ఇందులో 3 ఏళ్ల సాధారణ వారింటీ కాగా, సంవత్సరాల ఎక్స్‌టెండెట్ వారంటీ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.