హైదరాబాద్, (ప్రభ న్యూస్) : భారతదేశంలో సుప్రసిద్ధ, అత్యుత్తమ శ్రేణి పవర్ ప్రొడక్ట్స్ తయారీదారు హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తమ ప్రత్యేకమైన ఈ-కామర్స్ పోర్టల్‌ను తమ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హోండా ఇండియాపవర్.కమ్ ప్రారంభించింది.
ఈ ఆవిష్కరణతో దేశంలో ఈ-కామర్స్‌ను ప్రారంభించిన మొట్టమొదటి పవర్ ప్రొడక్ట్స్ కంపెనీగా హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నిలిచింది. ఈ ప్రకటనతో, హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ తమ వినియోగదారులకు మరో అడుగు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో హోండా నమ్మకమైన ఉత్పత్తులను కొన్ని క్లిక్స్‌తోనే సొంతం చేసుకోవచ్చన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.