ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హోంగార్డుగా పనిచేస్తున్న చుక్క బొట్ల మోహన్ (38) తన ఇంటి ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదిలాబాద్ పట్టణం తిలక్ నగర్ లో ఉంటున్న మోహన్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆసుపత్రిలో కార్డియాక్ సర్జరీ చేసుకొని చికిత్స అనంతరం ఏఆర్ హెడ్ క్వార్టర్ లో విధుల్లో చేరారు.
సోమవారం అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్లి తన లుంగీనీ ఉరితాడుగా బిగించుకొని ఆత్మహత్య ఘాతుకానికి ఒడిగట్టాడు. మంగళవారం తెల్లారేసరికి మృతదేహం చూడాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రిమ్స్ లో శవ పంచనామ నిర్వహించగా డి.ఎస్.పి జీవన్ రెడ్డి, టూ టౌన్ సిఐ కరుణాకర్ నివాళులర్పించారు.
- Advertisement -