రుణాల వడ్డీ రేట్లు, ఇళ్ల ధరల్లో పెరుగుదల కారణంగా దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గింది. దేశంలో రియల్ ఎస్టేట్‌పై జేఎల్‌ఎల్ ఇండియా నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం హైదరాబాద్, పుణే, కోల్‌కతా నగరాల్లో నివాస గృహాల మార్కెట్ అందుబాటులోనే ఉందని తెలిపింది. ముంబై మాత్రం ఖరీదైన నగరంగా మారిందని పేర్కొంది. హోమ్ పర్చేజ్ అఫర్టబిలిటీ ఇండెక్స్ (హెచ్‌పీఏఐ) పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది.
సగటు వార్షిక ఆదాయాన్ని ఆర్జించే కుటుంబం ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఆయా నగరాల్లో ఒక ఆస్తికి ఎంత మేర గృహ రుణం పొందగలరు అనే అంశాన్ని ఇది సూచిస్తుంది. గృహరుణ వడ్డీ రేట్లు, సగటు కుటుంబ ఆదాయం, నివాస గృహాల ధరల ఆధారంగా స్థోమత సూచినీ నిర్ణయిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 1000 చదరపు అడుగల విస్తీరణంలో ఉన్న ప్లాట్ కొనేందుకు గృహ రుణం పొందాలంటే, ఆ వ్యక్తికి ఉండాల్సిన కనీస ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా నిర్వచించింది.
100 విలువ ఉంటే ఒక కుటుంబానికి రుణం తీసుకునేందుకు సరిపోయే ఆదాయం ఉన్నట్లు అర్ధం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే కొనుగోలు శక్తి అంత ఎక్కువగా ఉన్నట్లు లెక్కిస్తారు. 100 కంటే తక్కువగా ఉంటే ఆ కుటుంబానికి గృహ రుణం పొందే అర్హత లేదని భావిస్తారు. కొనుగోలు శక్తి లేదని అర్ధం.
నివేదిక ప్రకారం హెచ్పీఏఐలో కోల్‌కతా 198 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పుణే 183, హైదరాబాద్ 174, బెంగళూర్ 168, చెన్నయ్ 162, ఢిల్లి 125 పాయింట్లతో ఉన్నాయి. ముంబై 92 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఈ నివేదికలో హైదరాబాద్ 196 పాయింట్లతో ఉంది.