Saturday, November 23, 2024

AP | కోటవురట్ల ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత..

అనకాపల్లి జిల్లా కోటవురట్ల హాస్టల్ లో సమోసాలు తిని 27 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైనవారిలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మిగతవారికి అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. ప్ర‌స్తుతం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ హాస్టల్ ను కొనసాగిస్తున్నట్లు ఆమె చెప్పారు. హాస్టల్ పై చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టల్స్ అన్నిటిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, సాధారణంగా ప్రభుత్వ అనుమతి ఉన్న హాస్టల్స్ లో బయటి నుంచి తీసుకొచ్చిన ఆహారపదార్థాలను అనుమతించబోరని, కానీ, కోటవురట్ల హాస్టల్ లో మాత్రం బయటి నుంచి ఎవరో తెచ్చిన ఆహారం తినడం వల్లే చిన్నారులు అస్వస్థకు గురయ్యారంటూ ఆమె చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement